హైదరాబాద్: 28°C
తెలంగాణ

CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సీతక్క

MLG: ములుగు మండలం ఎంఆర్ గార్డెన్స్‌లో వెంకటాపూర్ మండలానికి చెందిన అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. మొత్తం రూ.27,04,300 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, బైరెడ్డి భగవాన్ రెడ్డి, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు