హైదరాబాద్: 28°C
వార్తలు

హమాలి కార్మికులకు ఇందిరమ్మ బీమాపై అవగాహన

MHBD: బయ్యారం మండలం గంధంపల్లి, కొత్తపేట గ్రామంలో హమాలి కార్మికులకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ శనివారం అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకంలో కార్మికులందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.