హైదరాబాద్: 28°C
వార్తలు

సన్న బియ్యం విక్రయాల కేంద్రం ప్రారంభం

SKLM: సోంపేట డీసీఎంఎస్ సేల్స్ కౌంటర్‌లో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో సన్న బియ్యం విక్రయాలు శనివారం ప్రారంభమయ్యాయి. 26 కిలోల బస్తా అందుబాటులో ఉండగా, బీపీటీ రకం కిలో రూ.49, కేఎన్ఎం రకం కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 వంటి పోషకాలు ఉన్న ఈ బియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ అప్పలస్వామి కోరారు.