హైదరాబాద్: 28°C
వార్తలు

డీలిమిటేషన్ బిల్లు.. విశాఖకు ఎన్ని సీట్లు..?

VSP: డీలిమిటేషన్‌తో ఉమ్మడి విశాఖ జిల్లాలో 7-8 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల విభజనతో సింహాచలం, విశాఖ సెంట్రల్, మధురవాడ స్థానాలు రావొచ్చని అంచనా. మరో లోక్‌సభ స్థానం, రెండు ఎస్సీ, ఒక ఎస్టీ సీటు పెరిగే అవకాశముంది. మహిళా రిజర్వేషన్లతో కనీసం ఏడుగురు మహిళలకు అసెంబ్లీ సీట్లు దక్కవచ్చు.