హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి బాధితులతో డీజీపీ భేటీ

NZB: గంజాయి వ్యసనం నుంచి బయటపడి డీ-అడిక్షన్ చికిత్స పొందిన బాధితులతో డీజీపీ సీవీ ఆనంద్ నిజామాబాద్‌లో సమావేశమయ్యారు. మళ్లీ మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని సూచించారు. సమస్యలుంటే పోలీసులను సంప్రదించాలని, అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.