హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ

కృష్ణా: జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శనివారం అన్నారు. ఈ భద్రతా ఏర్పాట్లలో భాగంగా 7 మంది అదనపు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 62 మంది ఎస్సైలు నియమించామని తెలిపారు.