హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాటుసారా తయారీకి దూరంగా ఉండాలి: ఎక్సైజ్ సీఐ

AKP: రోలుగుంట మండలం కొంతలం దుర్గాదేవి ఆలయం వద్ద నర్సీపట్నం ఎక్సైజ్ సీఐ సునీల్ కుమార్ స్థానికులతో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. నాటుసారా తయారీ, విక్రయాలు, రవాణా చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అక్రమ మద్యంపై సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామని, గతంలో బైండోవర్ అయిన వారి కదలికలపై నిఘా కొనసాగిస్తామని తెలిపారు.