హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థినులకు మూడు నెలల ఇంటర్న్‌షిప్ శిక్షణ

ASR: అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డేటాప్రో కంప్యూటర్స్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినులకు మూడు నెలల ఇంటర్న్‌షిప్ శిక్షణ అందించనున్నారు. మొత్తం 105 మంది విద్యార్థినులను మూడు బ్యాచ్‌లుగా విభజించి గాజువాకలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ డా. కుసుమకుమారి అన్నారు. శిక్షణ కాలంలో వసతితో పాటు స్టైఫండ్ కూడా అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.