నిజామాబాద్ వారపు సంతలో కృష్ణ జింక కొమ్ములను పుర్రెతో సహా విక్రయిస్తున్న వోలెన్ లోకేశ్ (37)ను అటవీ అధికారులు అరెస్టు చేశారు. నామ్హవ్ వాడకు చెందిన నిందితుడిని శనివారం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఉత్తర ఫారెస్ట్ రేంజ్ అధికారి బి. సంజయ్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ
కృష్ణ జింక కొమ్ముల విక్రయదారుడి అరెస్టు!


