ATP: గుంతకల్లు కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీకమాసం శనివారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారి మూలమూర్తికి గంగా జలాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తికి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కొలువు తీర్చి ఆలయంలో ప్రాకారోత్సవం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఆంజనేయస్వామి ఆలయంలో ప్రాకారోత్సవం


