హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖిల్లా ఘనపురం వాసికి న్యాయశ్రీ–2026 అవార్డు

WNP: ఖిల్లా ఘనపురం వాసి, సీనియర్ న్యాయవాది రామమోహన్‌కు ప్రతిష్ఠాత్మక న్యాయశ్రీ–2026 అవార్డు లభించింది. హైదరాబాద్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌస్ మీర్ మొహియుద్దీన్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. పేదలకు ఉచిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కల్పించడంలో చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. ఈ అవార్డు రావడం పట్ల ఘనపురం వాసులు హర్షం వ్యక్తం చేశారు.