హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గుడిసెలు, నీటి ఎద్దడి లేని పల్లెలుగా తీర్చిదిద్దుదాం'

RR: చౌదరిగూడ మండల సర్వసభ్య సమావేశంలో షాద్‌నగర్ MLA వీర్లపల్లి శంకర్ పాల్గొని ప్రజా సమస్యలపై 3 గంటల పాటు సమీక్షించారు. గుడిసెలు లేని గ్రామాలుగా మార్చడానికి అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.