హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోటి దీపోత్సవంలో అలరించిన క్లాసికల్ డ్యాన్సర్

SRD: ​అమీన్‌పూర్ పట్టణానికి చెందిన ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ వడ్ల నివేదిత మరోసారి తన అద్భుత నాట్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్‌లో జరుగుతున్న 'కోటి దీపోత్సవం' వేదికపై 'పక్కపక్కనే పల్లె' అనే జానపద పాటకు ఆమె చేసిన నృత్యం భక్తులను, ప్రేక్షకులను విశేషంగా అలరించింది. పల్లె సంస్కృతి ఉట్టిపడేలా నాట్య ప్రదర్శన సాగింది.