హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ మొరం రవాణా.. జేసీబీ, రెండు ట్రాక్టర్లు సీజ్

KMR: ఎల్లారెడ్డి పట్టణ పరిధిలో శనివారం అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్న ఒక జేసీబీ, రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. వాహన యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. గనులు, ఖనిజాల చట్టం 1957లోని సెక్షన్ 4(1), 4(1A), 21(1) ప్రకారం అక్రమ తవ్వకాలు, రవాణాపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.