హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బొలెరో బోల్తా... చెల్లా చెదురైన చేపలు!

NLR: రాపూరు–డక్కిలి మెయిన్ రోడ్డు 565పై సిద్దవరం బ్రిడ్జి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనానికి బర్రెలు అడ్డురావడంతో వాటిని తప్పించే క్రమంలో డ్రైవర్ వాహనాన్ని పక్కకు తిప్పాడు. దీంతో అదుపుతప్పిన బొలెరో బోల్తా పడింది. ప్రమాదంలో చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు