హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత ఎన్నికలకు పటిష్ఠ పోలీసు బందోబస్తు

NLR: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 14 మండలాల్లో 2,000 మందికి పైగా పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. 214 గ్రామ పంచాయతీల పరిధిలో 1,989 పోలింగ్ కేంద్రాల్లో 4,29,108 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. 14 డ్రోన్ బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.