AKP: మునగపాక మండలంలో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 700 మందిని బైండోవర్ చేశామన్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున జనాలు ఒకచోట గుమికూడరాదని హెచ్చరించారు. కవాతు నిర్వహించి నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు


