హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో కొత్త అసెంబ్లీ స్థానాలపై చర్చ

సత్యసాయి: రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు పెరిగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురం అర్బన్, రూరల్ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే లేపాక్షి, చిలమత్తూరు మండలాలతో కొత్త నియోజకవర్గం ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. ఇవి ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.