హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ 1న శ్రీ శక్తిపీఠంలో కాలభైరవ మహాయాగం

TPT: తిరుపతి సమీపంలోని రాయలచెరువు శ్రీ శక్తిపీఠంలో డిసెంబర్ 1న శ్రీ మృత్యుంజయ కాలభైరవ మహాయాగం నిర్వహించనున్నారు. మహాకాలాష్టమి, కాలభైరవ జయంతిని పురస్కరించుకొని లక్ష మినప గారెలతో తొలిసారిగా ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహాస్వాముల దివ్యాశీస్సులతో, రమ్యానందభారతీ స్వామివారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది.