కృష్ణా: పమిడిముక్కల మండలంలోని పంపిణీ కేంద్రంలో 9 మంది పీఓలు, ఓపీవోలు ఎన్నికల విధులకు గైర్హాజరైనట్లు కలెక్టర్ బాలాజీ శనివారం గుర్తించారు. వారి పేర్లతో జాబితా సిద్ధం చేయించి, అప్పటికప్పుడు కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులపై సంతకం చేశారు. గైర్హాజరైన సిబ్బందిపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడంతో పాటు, తదుపరి విచారణకు కూడా ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
విధులకు హాజరుకాని అధికారులపై సస్పెన్షన్ ఆర్డర్


