హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతికున్నా మృతుడని రికార్డు

BDK: బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గొమ్ముర్ కాలనీకి చెందిన 80 ఏళ్ల మద్దిబోయిన పిచ్చయ్య బతికే ఉన్నా ప్రభుత్వ ఆన్‌లైన్ రికార్డుల్లో మరణించినట్లు నమోదైంది. జూలై 29న పింఛను జాబితా నుంచి పేరు తొలగించడంతో నాలుగు నెలలుగా నెలకు రూ.2,016 ఆసరా పింఛను అందడం లేదు. రికార్డులు సరిచేసి పింఛను పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరారు.