హైదరాబాద్: 28°C
తెలంగాణ

గట్టయ్య సెంటర్‌లో ఫోన్ చోరీ

KMM: గట్టయ్య సెంటర్‌లో కిరాణా దుకాణం వద్ద సరుకులు కొనేందుకు వచ్చిన రమణ అనే వ్యక్తి జేబులోంచి రూ.1.5 లక్షల విలువైన సెల్‌ఫోన్‌ను ఇద్దరు యువకులు చోరీ చేశారు. వినియోగదారుల్లా నటించి ఒకరు బైక్ మీద నుంచి పడినట్లు నటించగా, లేపేందుకు వెళ్లిన సమయంలో మరొకడు ఫోన్ లాక్కొని బైక్‌పై పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో టూ టౌన్ పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా విచారిస్తున్నారు.