హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఎస్ఐ

SRPT: హుజూర్‌నగర్ పట్టణంలోని కోదాడ రోడ్డులో ఎస్ఐ బి. హనుమాన్ నాయక్ పోలీసు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.