హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ సంక్షేమ వస్తి గృహాన్ని సందర్శించిన షేక్ రియాజ్

NTR: నందిగామ పట్టణ బీసీ సంక్షేమ వసతి గృహాన్ని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రియాజ్ సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి మేధాశక్తిని పరీక్షించారు. చదువే నిజమైన సంపదని, విద్యతో ఉన్నత హోదా, గౌరవం, పేరు ప్రఖ్యాతులు వస్తాయని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.