హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

కడప జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శనివారం వేంపల్లెలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌తో కలిసి పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్ల సౌకర్యాలు, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు.