AKP: జ్యోతిరావు ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. ఫూలే వర్ధంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫూలేకు కలెక్టర్ ఘన నివాళి


