WGL: ఖిల్లా వరంగల్ మండలం మామునూరు ప్రధాన రోడ్డుపై శనివారం ట్రాక్టర్ బైకును ఢీకొన్న ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన చెరుకూరి కార్తీక్, లిఖిత తీవ్రంగా గాయపడ్డారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ల కోసం సూర్యాపేట నుంచి బైకుపై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారిని 108వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
తెలంగాణ
ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు..


