హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

కర్నూలు జిల్లాలో 9 మండలాల్లో జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచి, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసేలా చూడాలన్నారు.