హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలి'

NZB: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి మాతా శిశు మరణాలను తగ్గించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి, డెంగీ నివారణ, క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార, ఆసుపత్రుల్లో పరిశుభ్రత, నాణ్యమైన వైద్య సేవలపై అధికారులకు సూచనలు చేశారు.