హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

MBNR: జిల్లాకేంద్రంలో మేడ రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి షాద్‌నగర్ నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ జరుపుల రాజు నాయక్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యాలయం వేదికగా నిలవాలని రాజు నాయక్ పిలుపునిచ్చారు.