హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

ప్రకాశం: కొండేపి మండలం దాసరెడ్డిపాలెం గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. రహదారి పక్కనే తక్కువ ఎత్తులో, ప్రజలకు చేతికి అందే విధంగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో చిన్నపిల్లలు, పాదచారులకు ముప్పు తప్పదని వాపోతున్నారు.