హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగునీటి తరలింపుపై సీపీఐ ఆగ్రహం

NLG: నాగార్జునసాగర్ నుంచి సొరంగం ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించే ఏపీ యత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్. అంజయ్యచారి విమర్శించారు. శనివారం నాంపల్లి మండల కార్యాలయంలో పల్లె సైదులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ అంశంపై డిసెంబర్ 1న నల్గొండ కలెక్టరేట్ వద్ద జైల్ భరో నిర్వహిస్తామని ప్రకటించారు.