హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డీజీపీల కాన్ఫరెన్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'

TPT: డిసెంబరు మొదటి వారంలో నిర్వహించనున్న డీజీపీల కాన్ఫరెన్స్ నేపథ్యంలో రేణిగుంట సమీపంలోని IISERలో చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ శనివారం పోలీసు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే ఉన్నతాధికారులకు అవసరమైన వసతులు, భద్రతా ఏర్పాట్లు, ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు.