హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ సీఈవోగా సీత శ్రీనివాస్‌కు అవార్డు

BHNG: భూదాన్ పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవో సీత శ్రీనివాస్‌కు రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ కార్నివాల్‌లో ఉత్తమ సీఈవో పురస్కారం దక్కింది. బ్యాంకులో రూ.405.38 కోట్ల డిపాజిట్లు ఉండగా, రూ.292.33 కోట్ల రుణాలు మంజూరయ్యాయని చైర్మన్ తాడక రమేశ్ తెలిపారు. సైబర్ మోసాలపై ప్రతి నెలా మూడో శనివారం ఖాతాదారులకు అవగాహన కల్పిస్తున్నారు.