హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభంకాని ధాన్యం కొనుగోళ్లు

MLG: గోవిందరావుపేట(M)లోని పస్రలో ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20రోజులు గడుస్తున్నా ఒక్కగింజ కూడా కొనుగోలు చేయలేదని సీపీఎం గ్రామకార్యదర్శి కడారి నాగరాజు ఆరోపించారు. పెట్టుబడులు రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు ధాన్యం విక్రయించడమూ భారంగా మారిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.