NDL: సంజామల మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు కేటాయించిన పలువురు సిబ్బంది గైర్హాజరు కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు రిటర్నింగ్ అధికారి జనార్దన్ రెడ్డి చర్యలకు ఉపక్రమించారు. విధులకు హాజరుకాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
విధులకు డుమ్మా.. RO చర్యలు!


