హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజకీయ దాడులపై పుష్పశ్రీవాణి ఆగ్రహం

PPM: కురుపాం నియోజకవర్గంలో రాజకీయ దాడుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ డిప్యూటీ సీఎం పీ.పుష్పశ్రీవాణి విమర్శించారు. ఒకే రోజు రెండు గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. గరుగుబిల్లి మండలం లఖనాపురంలో వైసీపీ మహిళా కార్యకర్త మంగమ్మ కుటుంబంపై దాడి జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల విజయోత్సవాల పేరుతో దాడులకు పాల్పడటం సరికాదన్నారు.