హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

BDK: మణుగూరు మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో MLA పాయం వెంకటేశ్వర్లు ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పురోగతి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై శాఖల వారీగా సమీక్షించారు. ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.