MLG: వెంకటాపూర్ (M) పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన క్రిస్టాఫా లోప్స్ సందర్శించారు. అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. గైడ్ విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం, కాకతీయుల చరిత్రను వివరించారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో భాస్కర్, టూరిస్ట్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
రామప్పను సందర్శించిన అమెరికా దేశస్తుడు


