హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు సమన్వయం అవసరం'

PPM: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఆర్‌బీఎస్‌కే అధికారి డాక్టర్ టీ.జగన్ మోహనరావు సూచించారు. శనివారం మార్కొండపుట్టి జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. విద్యార్థుల్లో 4డీ లక్షణాలను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.