హైదరాబాద్: 28°C
తెలంగాణ

సండ్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫైర్

KMM: మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సండ్ర వెంకట వీరయ్య రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయిన సండ్రకు మహిళలను విమర్శించే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు.