హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఈవీఎంలు, పోలింగ్ ప్రక్రియను ఆక్రమిస్తున్నారు’

బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని అందరికీ తెలుసని.. ఈవీఎంలు, పోలింగ్ ప్రక్రియను ఆక్రమిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటు చోరీ అంశంపై జ్ఞానేష్ కుమార్‌ను చాలా సార్లు ప్రశ్నించామన్నారు. దేశంలో 14 కోట్ల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని ఈసీ చెబుతోందని ఆయన పేర్కొన్నారు. బీహార్, అసోం, బెంగాల్‌లో లక్షల మంది ఓటర్లను తొలగించారని లోక్‌సభ విపక్ష నేత తీవ్రంగా మండిపడ్డారు.