హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కూలీలకు కనీస వేతనం అందించాలి'

WNP: ఎల్‌నినో ప్రభావంతో ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.150 నుంచి రూ.200 మాత్రమే లభిస్తోందని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీరామ్ అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.308 కూలీ అందించాలని, వేసవి భృతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కూలీని రూ.700కు పెంచాలని కోరారు. సమస్య పరిష్కరించకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.