హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజేతలకు రూ.5 లక్షల బహుమతులు

ATP: వదాన్య టాలెంట్ టెస్ట్-2026 పోస్టర్‌ను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆవిష్కరించారు. వదాన్య ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల 9, 10వ తరగతి విద్యార్థులకు డిసెంబర్ 27న అనంతపురం, కొత్తచెరువులో పరీక్ష నిర్వహించనున్నట్లు వ్యవస్థాపకుడు అశోక్ తెలిపారు. విజేతలకు రూ.5 లక్షల బహుమతులు, స్కాలర్‌షిప్‌లు అందిస్తామని, డిసెంబర్ 8లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.