హైదరాబాద్: 28°C
వార్తలు

'మోదీ ఫేక్ ప్రధాని'.. రాహుల్ గాంధీ

2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు నకిలీ ఎన్నికలని, ప్రధాని కూడా నకిలీ వ్యక్తేనని లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం నియంత పాలన నడుస్తోందని, ఈ నియంతృత్వ పాలన గురించి ప్రజలంతా తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, అమిత్ షా, అంబానీ, అదానీ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.