ADB: జిల్లా కేంద్రంలో ఈ నెల 29న జరగనున్న ఎస్ఐ ప్రాథమిక పరీక్ష కోసం 300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం పట్టణంలో సిబ్బందితో సమావేశమై ఆయన మాట్లాడారు. ఉదయం 7 గంటలకే కేంద్రాలకు చేరుకుని తనిఖీలు చేయాలని SP ఆదేశించారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ
ఎస్ఐ పరీక్షకు 300 మందితో పటిష్ట పోలీసు బందోబస్తు


