హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య చికిత్సకు రూ.4.50 లక్షల LOC మంజూరు

GDWL: రాజోలి మండల కేంద్రానికి చెందిన తెలుగు పెద్ద వెంకటరాముడికి వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వం రూ.4,50,000 LOC మంజూరు చేసింది. ఈ మేరకు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తన కార్యాలయంలో ఎల్వోసీ పత్రాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.