KDP: కొండాపురం మండలం కొట్టాలపల్లెకు చెందిన తోడికోడళ్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. టీడీపీ నాయకుడు అరుణ్ కుమార్రెడ్డి భార్య జ్యోత్స్న రేగడిపల్లె ఎంపీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవమయ్యారు. ఆయన తమ్ముడు హరిచంద్రారెడ్డి భార్య బేబిరాణి కొట్టాలపల్లె సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తోడికోడళ్లు


