కాశీ తమిళ సంగమం 5.0 ఇవాళ ప్రారంభం కావడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాశీకి వస్తున్న తమిళనాడు, ఇతర ప్రాంతాల వారికి స్వాగతం పలికారు. 'తిరుక్కురళ్ పయిల్వోం' థీమ్ ప్రత్యేకమన్నారు. 10 విదేశీ భాషలు సహా 50 భాషల్లో తిరుక్కురళ్ అనువాదం విడుదలైందని, తిరువళ్లువర్ ఆలోచనలు యువతకు చేరాలన్నారు. ఈ వేదిక సాంస్కృతిక, మేధో మార్పిడితో 'శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని బలోపేతం చేసిందన్నారు.
వార్తలు
‘తిరువళ్లువర్ ఆలోచనలు యువతకు చేరాలి’


