హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్'

PDPL: ధర్మారంలోని బ్రిలియంట్ మోడల్ స్కూల్‌లో శనివారం మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సుస్మిత ఆధ్వర్యంలో బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించి, 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు టీకాలు అందించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.